నెలాఖరులోగా ‘అమ్మఒడి’ అర్హుల జాబితా

నెలాఖరులోగా 'అమ్మఒడి' అర్హుల జాబితా



సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. నవంబర్‌ నెలాఖరులోగా అర్హుల జాబితా రూపొందించేందుకు వీలుగా షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇప్పటికే 'చైల్డ్‌ ఇన్ఫో'లో నమోదైన  సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్‌ సెంటర్‌ ఫర్‌ ఫైనాన్షియల్‌ సిస్టమ్స్, సర్వీసెస్‌కు(ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌) అందించారు. ఆ సమాచారాన్ని తెల్లరేషన్‌కార్డుల సమాచారంతో అనుసంధానించి, ఆ వివరాలను పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు(హెచ్‌ఎం) అందుబాటులో ఉంచుతారు.